ఖిలా వరంగల్ (మామునూరు) వెలుగు : ఎనిమిదేండ్ల బాలికపై ఓ యువకుడు లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన వరంగల్ మిల్స్ కాలనీ పీఎస్ పరిధిలోని ఉర్సు హరిజనవాడలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మంగళవారం రాత్రి బాలిక కుటుంబ సభ్యులు కూల్‌డ్రింక్ కోసం ఆమెను కిరాణ షాపుకు పంపించారు.
కొంత సమయం తర్వాత చిన్నారి ఏడ్చుకుంటూ రావడంతో ఏం జరిగిందని తల్లిదండ్రులు ప్రశ్నించారు. షాప్ ఓనర్ వేల్పుగొండ కుమారస్వామి కుమారుడు కమల్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని బాలిక కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
